వేములవాడ, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ మార్కుఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గురువారం ఉదయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు గుండి నరసింహ మూర్తి ఉన్నారు.