డిచ్‌పల్లి, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ వెల్లడి విజ్ఞప్తి చేశారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, సభాధ్యక్షులుగా తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ప్రసిడెంట్, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్. లింగమూర్తి, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ వైస్ – ప్రసిడెంట్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య కె. ముత్యం రెడ్డి, ఐసిఎస్‌ఎస్‌ఆర్ – ఎస్‌ఆర్‌సి డైరెక్టర్ ఆచార్య ఉషా కిరణ్, హైదరాబాద్ విశ్వవిద్యాల్యం నుంచి కీలకోపన్యాస కర్త ఆచార్య జె. మనోహర్ రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. కనకదుర్గ దంటు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ సెక్రటరి ఆచార్య బి. శివారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారని ఆయన అన్నారు.
కార్యక్రమంలో లోకల్ సెక్రెటరీ డా. సంపత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. అక్కినపల్లి పున్నయ్య, డా. పాత నాగరాజు, డా.రవీందర్ రెడ్డి, డా. వెంకటేశ్వర్లు, డా. సప్న, డా.శ్రీనివాసులు, డా. దత్త హరి తదితరులు పాల్గొననున్నారు.
సదస్సులో దాదాపుగా 50 మంది ప్రసిద్ధ ఆర్థికవేత్తలు పరిశోధనాపత్రాలు సమర్పిస్తారు. ప్రధానంగా సదస్సు తెలంగాణ అభివృద్ధికి రాజకీయ ఆర్థిక విశ్లేషణ, ఆదాయ అసమానతలు మరియు పట్టణీకరణ అనే అంశాల పట్ల లోతైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.