కామారెడ్డి, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 29 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ అన్నారు. సమ్మె పోస్టరును శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలతో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని నాలుగు లేబర్ కోడ్‌ల రద్దుకై పోరాడుతామన్నారు.
కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు మరియు బ్యాంకింగ్, రైల్వే, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, సింగరేణిల ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అలాగే నాలుగు లేబర్ కోడ్ సర్వీస్ యాక్టను రద్దు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని మిగిలిన జీవోలను సవరించి కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా 26 వేల రూపాయలకు పెంచాలని, అంగన్‌వాడి, ఆశా, మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్ల అందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత అమలు చేయాలన్నారు.
అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గించాలని, కాంటాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఈఎస్‌ఐ పిఎఫ్ అమలు చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఏఐటియుసి రాష్ట్ర నాయకుడు విఎల్ నరసింహా రెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు టీ బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఆర్ రాజశేఖర్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.