కామారెడ్డి, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగ తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సిగరెట్, బీడీలు, పొగాకు తాగడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగిన వారికి జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శోభారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.