కామారెడ్డి, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాతృ మరణాల రేటును తగ్గించడానికి వైద్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. హైరిస్క్ కేసులను గుర్తించి ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈసీజీ తప్పనిసరిగా చేయించాలని పేర్కొన్నారు.
అత్యవసరమైతే 102 ఆంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ,డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శోభారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.