కామారెడ్డి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దశలవారీగా ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తులు వారం రోజుల్లో 33 శాతం, 45 రోజుల తర్వాత 33 శాతం, 90 రోజుల లోపు 34 శాతం డబ్బులు చెల్లించాలని కోరారు. సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు వినియోగించు కోవాలని కోరారు.