నిజామాబాద్, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్దులు, దివ్యాంగుల కోసం జిల్లా మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్లను సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు.
దివ్యాంగులు, వికలాంగులకు ఉపయోగపడే విధంగా తెలుగు, ఆంగ్ల భాషలలో రూపొందించిన క్యాలెండర్లలో వారికోసం ఉద్దేశించిన చట్టాల గురించి పొందుపర్చామని ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రaాన్సీరాణి పేర్కొన్నారు.