రూ. 3 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు

కామారెడ్డి, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్లు పొందడానికి ప్రత్యక్ష వేలంపాటలో పాల్గొని తమకు నచ్చిన ప్లాట్లను పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్లపై వేలం పాట అవగాహన సదస్సులో మాట్లాడారు. రాజీవ్‌ స్వగృహ పథకంలో గతంలో రూ. 3000 చెల్లించిన లబ్ధిదారులు వేలంపాటలో పాల్గొనవచ్చని సూచించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈఎండి చెల్లించిన లబ్ధిదారుడు ఒక ప్లాటును సొంతం చేసుకోవచ్చని చెప్పారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తి నెలలోపు పూర్తి డబ్బులు చెల్లిస్తే రెండు శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. ప్లాట్లు పొందినవారు మూడు విడతలుగా డబ్బులు చెల్లించాలని కోరారు. మార్చి 14 నుంచి 17 వరకు వేలం పాట దశల వారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవో శీను, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »