నిజామాబాద్, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో నాగారంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో మహిళలకు ఎయిడ్స్,టి.బి వ్యాధులపై అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఎయిడ్స్ నియంత్రణ అధికారి ప్రవీణ్ రెడ్డి హాజరై ఎయిడ్స్‌ని ఎలా గుర్తించాలి, ఎయిడ్స్‌ను ఎలా నియంత్రణ చేయాలి, ఎయిడ్స్ వ్యాధి సోకాకుండ్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ సోకితే ఏ మందులు వాడాలి, ప్రభుత్వం ఎయిడ్స్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు, సోకిన వారి కోసం అందిస్తున్న మందుల గూర్చి వివరించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన టి. బి నియంత్రణ అధికారి నరేష్ మాట్లాడుతూ టి.బి కి ప్రభుత్వం మంచి మందులు ఇస్తుందని, వాటిని వినియోగించడం ద్వారా టి.బి నుంచి తొందరగా బయట పడవచ్చని సూచించారు. టి.బి వ్యాధి లక్షణాలు, ముందుకు,చికిత్స విధానం పట్ల పూర్తి అవగాహన కల్పించారు. కార్యకమానికి అధ్యక్షత వహించిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో టి.బి సమాచార పోస్టర్ ఆవిష్కరణ చేశారు, అనంతరం సమీప తండాలో టి.బి, ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జైనాబ్, వైస్ ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.