కామారెడ్డి, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి, స్వఛ్ఛ సర్వేక్షన్, బస్తీ దవాఖానలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో బస్తి దావఖానాల కోసం మున్సిపల్ అధికారులు స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు.
పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్ష చేశారు. కామారెడ్డిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్లు రమేష్ కుమార్, జగ్జీవన్, అధికారులు పాల్గొన్నారు.