ఆర్మూర్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత

ఆర్మూర్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆర్మూర్‌ దవాఖాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్మూర్‌ ఆసుపత్రి 30 నుంచి వంద పడకలకు అఫ్‌ గ్రేడ్‌ అయ్యిందని, భవనాల నిర్మాణం కూడా పూర్తి ఆయిందన్నారు.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి నేను వస్తా ఆర్మూర్‌ ఆసుపత్రికి అనే స్థాయికి చేరిందన్నారు. వంద పడకల కోవిడ్‌ సెంటర్‌గా కూడా సేవలు అందించిందన్నారు. 20 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయన్నారు. అయితే డాక్టర్లు, ఇతర సిబ్బంది తీవ్రంగా ఉందని జీవన్‌ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చి వెంటనే ఆసుపత్రిలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

అలాగే ఆర్మూర్‌ దవాఖానకు ఒక డయాలసిస్‌ సెంటర్‌ను కూడా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా వుండగా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మచ్చర్ల, చిక్లి, గుంజిలి ఎత్తిపోతలకు వెంటనే ఆమోద ముద్ర వేసి పనులు చేపట్టాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లిఫ్ట్‌ ఇర్రిగేషన్‌ పథకాల అంచనాలు కూడా పూర్తి అయ్యాయని, ఫైనాన్షియల్‌ క్లియరెన్స్‌ ఇచ్చి జీవో జారీ చేయడమే మిగిలి ఉందని జీవన్‌ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »