టీయూలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

డిచ్‌పల్లి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. ఎన్‌. స్వప్న మరియు 4 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ కళాశాల సమావేశ మందిరంలో ‘‘ప్రపంచ వినియోగదారుల దినోత్సవం’’ సందర్బంగా కోవిద్‌ – 19 పూర్వాపర కాలంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ’’ అనే అంశంపై సదస్సు జరిగింది.

సమావేశానికి నిజామాబాద్‌ నుంచి జిల్లా వినియోగదారుల కమీషన్‌ అధ్యక్షులు సువర్ణ జయశ్రీ విచ్చేసి కీలకోపన్యాసం చేశారు. విద్యార్థులు దేశానికి ఎల్లవేళలా ఉపయోగపడే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పరుచుకొని సమాజ సేవలో ముందడుగు వేయాలన్నారు. అందులో భాగంగానే వియోగదారుల హక్కుల గురించి తెలుసుకొని తద్వారా సమాజాన్ని జాగృతం చేయాలన్నారు. 31 ఆర్టికల్‌ పాత చట్టం ప్రకారం వినియోగదారుల ఫోరం ఉండేదని, 107 ఆర్టికల్‌ కొత్త చట్టం ప్రకారం దానిని కమీషన్‌గా రూపొందించారని అన్నారు.

రక్షణ హక్కు, సమాచారం హక్కు, పరిహారం పొందే హక్కులు ఈ చట్టంలో అంతర్భాగమని అన్నారు. వినియోగదారులకు సివిల్‌, క్రిమినల్‌ అధికారాలు ఉంటాయన్నారు. అందులో నష్ట పరిహారానికి జరిమానా, శిక్షలు కుడా విధింప బడుతాయన్నారు. వస్తువుల పరంగా, సేవల పరంగా ప్రజలకు నష్టం కలుగకుండా ఉండాలనేదే ఈ చట్టం ప్రధాన ధ్యేయమని అన్నారు. ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధర తీసుకొంటే తప్పేనని అన్నారు. వస్తువులు కొంటే ఒరిజినల్‌ బిల్లు, వస్తువులు ఒక వేళ ఆన్‌లైన్‌లో కొంటే ట్రాన్సాక్షన్‌ బిల్లులు తీసుకోవాలన్నారు.

తప్పుడు వ్యాపార ప్రకటనల మీద కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాలంటీర్స్‌ వినియోగదారుడిని రక్షించే బాధ్యత వహించాలని అన్నారు. ప్రశ్నించే అధికారం కలిగి ఉండాలని అన్నారు. ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పరుచుకొని సమాజ సేవలో ముందడుగు వేయాలన్నారు. వినియోగదారుల చట్టం మీద అవగాహన ఏర్పరుచుకొని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించుకోవాలన్నారు.

కార్యక్రమంలో రీసోర్స్‌ పర్సన్‌గా నిజామాబాద్‌ నుంచి విచ్చేసిన జిల్లా అడ్వకేట్‌ రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ ఒక వ్యక్తి గర్భస్థ శిశువు నుంచి మరణించిన తర్వాత కూడా అతడు వినియోగదారుడిగా వ్యవహరింపబడుతాడన్నారు. ఇన్స్యూరెన్స్‌ల్లో కూడా న్యాయాన్ని కోరవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ మాట్లాడుతూ కోవిద్‌ -19 నేపథ్యంలో అందరు ఆన్‌లైన్‌ మార్కెట్‌కు మొగ్గు చూపారని, ఆ సందర్భంలో టిన్‌, జిఎస్‌టి పన్నుల మీద కూడా అవగాహన కలిగి ఉండాలని గుర్తు చేశారు.

ఐఎస్‌ఐ, ఎగ్మార్క్‌ వంటి వస్తువులను ఖరీదు చేయాలని సూచించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జట్లింగ్‌ ఎల్లోసా వినియోగదారుల హక్కుల చట్టం ఏర్పడిన సందర్భాలను, ఉద్యమాలను గూర్చి తెలిపారు. న్యూయార్క్‌ ఇల్లీనాయిస్‌ స్టేట్‌లో మొదలైన ఉద్యమం తర్వాత ప్రపంచ దేశాలను చాలా ప్రభావితం చేసిందన్నారు. తదనంతరం చర్చాగోష్టిలో డా. ప్రసన్న రాణి, డా. త్రివేణి తదితర వాలంటీర్స్‌ పాల్గొన్నారు. మంచి సామాజిక అంశం మీద అవగాహనా సదస్సు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1 Ê 4 ప్రోగ్రాం ఆఫీసర్స్‌ డా. స్వప్న, డా. స్రవంతి లను వీసీ ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »