గాంధారి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల సొసైటీ పాలకవర్గ సమావేశం పెద్దభూరి సాయికుమార్ అధ్యక్షతన బుధవారం జరిగింది. సమావేశంలో సొసైటీ అభివృద్ధితో పాటు పలు అంశాలను చర్చించారు. సొసైటీ అభివృద్ధి కొరకు అందరూ కృషి చేయాలనీ చైర్మన్ సాయికుమార్ కోరారు. సభ్యుల నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఉదల్ సింగ్, డైరెక్టర్లు అశోక్ రెడ్డి, తాడ్వాయి సంతోష్, వజీర్ సవిత బాయి ముకుంద్ రావు, దొళ్లు సాయిలు, గాండ్ల లక్ష్మణ్, శివాజీ రావు, జనార్దన్ గౌడ్, గొల్ల హర్జా, గణపతి రావు, రాథోడ్ నెహ్రు, కార్యదర్శి మోహన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.