గాంధారి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో వరి, మొక్కజొన్న పంటలను వ్యవసాయధికారి నరేష్ బుధవారం పరిశీలించారు. మండలంలోని ముదోలి గ్రామ పరిధిలోని వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడుత, జింక్ లోపాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీటి నివారణకు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాన్ ట్రయినిలిప్రోల్ 60 మి.లి. వేప నూనెలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలనీ రైతులకు సూచించారు.
దీనితో వరిలో కాండం తోలుచు పురుగు, ఆకు ముడుత నివారించవచ్చని తెలిపారు. జింక్ లోప నివారణకు చెలమిన్ జింక్ సెల్ఫీట్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యడం ద్వారా మంచి ఫలితం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ దిక్షిత్, విఆర్‌ఏలు రాజు, సాయిలు, రైతులు పాల్గొన్నారు.