కామారెడ్డి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గౌడ సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉప్పలవాయి గోపి గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ మేరకు నియామక పత్రాన్ని ఆబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అందజేశారు. ఈ సందర్బంగా గోపి గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో గౌడ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. మండల కమిటీలను వేసి సంఘం సభ్యత్వాలను పెంచుతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు ప్రతాప్ లింగం గౌడ్, సంజయ్ గౌడ్, రాజయ్య గౌడ్, అధ్యక్షులు రాజా గౌడ్, మాజీ అధ్యక్షుడు హరికిషన్ గౌడ్ మాజీ అధ్యక్షుడు చంద్ర గౌడ్ మందిరా అధ్యక్షులు రవీందర్ గౌడ్ జనరల్ సెక్రెటరీ మోతే సతీష్ గౌడ్, సీసాల నారా గౌడ్, సమరసింహా గౌడ్, నాడెం శ్రీధర్ గౌడ్, ఉప్పల్వాయి వెంకట్ గౌడ్, బుర్ర రవీందర్ గౌడ్, ముత్యంపేట రంజిత్ గౌడ్, ఎల్ కంటి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.