కామారెడ్డి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి మండలం గూడెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గ్యారా లక్ష్మిసాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి మార్కెట్ కమిటీ నుండి సుమారు 20,000 రూపాయల మందులను గూడెం గ్రామంలో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్లకు ఎలాంటి వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు, వ్యాధులు ఉన్నా కుడా సరైన మందులు అందజేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, జెడ్పీ టిసి రమా లాక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ పాత లక్ష్మణ్,వైస్ చైర్మన్ శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మ మోహన్ రెడ్డి, గోపి గౌడ్, గూడెం బాలరాజు, గూడెం సర్పంచ్ స్వామి, మార్కేట్ కమిటీ సెక్రెటరీ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.