కామారెడ్డి, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గురువారం టి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని జిల్లా క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు.
తాము చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధిహామీ పిడి వెంకట మాధవరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
కార్యక్రమంలో టిఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, క్షేత్ర సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండయ్య, ప్రతినిధులు నరేందర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.