కామారెడ్డి, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐకెపి, సెర్ప్, మెప్మా కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని ఆశిస్తూ జేఏసీ, టిఎన్‌జిఓఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ ఉద్యోగుల చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి మాట్లాడారు.
సెర్ప్, ఐకెపి, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రుణపడి ఉంటామని తెలిపారు. సీఎం ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని చెప్పారు. ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ దేవేందర్ మాట్లాడారు.
సెర్ప్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమని తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం ఉద్యోగులు కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో టీజిఓఎస్ జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి, టిఎన్‌జిఓఎస్ ప్రధాన కార్యదర్శి సాయిలు, సహాయ కార్యదర్శి నాగరాజు, ఐకెపి,సెర్ప్ ఉద్యోగులు రామ్ నారాయణ గౌడ్, రామచంద్ర గౌడ్, మోహిజ్, రూరల్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, జుగల్ కిషోర్, ప్రతినిధులు చక్రధర్, లక్ష్మణ్, పోచయ్య, గణేష్, రాజేశ్వర్, సంతోష్, భూమయ్య, నరసింహులు, శశికిరణ్ పాల్గొన్నారు.