కామారెడ్డి, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రత్యేకతలు, విశిష్టతను తెలిపే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి డిగ్రీ కళాశాల చేస్తున్న కృషిని, కళాశాలలో ఉన్న వసతులు వివరిస్తూ రూపొందించిన కరపత్రం చూసి కళాశాల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు.
కరపత్రాన్ని ప్రిన్సిపాల్ కె. కిష్టయ్య ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ను కలిసి న్యాక్ దృష్టిలో కరపత్రం రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘న్యాక్ పర్యటన సందర్భంగా కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.కిష్టయ్యతో, వైస్ ప్రిన్సిపల్ ఈ. రాజ్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ వి. శంకరయ్య, డాక్టర్ గణేశ్, డాక్టర్ రామకృష్ణ, ఎం.రామస్వామి, డాక్టర్ శ్రీనివాస్ రావు, జె. శివ కుమార్, రాములు, లక్ష్మణాచారి ఉన్నారు.