కామారెడ్డి, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉన్న 12 నుంచి పద్నాలుగేళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వారి తల్లిదండ్రులు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జూమ్ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 నుండి 14 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వారి తల్లిదండ్రులు తీసుకెళ్లి చేయించాలని కోరారు. పిల్లలకు తప్పనిసరిగా బుధవారం రోగ నిరోధక టీకాలు ఇవ్వాలని చెప్పారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించి వారికి పౌష్టికాహారం తినే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్సులో ఇంచార్జ్ జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శోభారాణి, వైద్యులు పాల్గొన్నారు.