కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెలివరీ నిమిత్తమై ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బ్లడ్ బ్యాంకులలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణకు తెలిపారు.
వెంటనే స్పందించి రక్తాన్ని సకాలంలో అందజేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి రక్తాన్ని అందజేసిన రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.