కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లైట్ ఫర్ బ్లైండ్ సంస్థ నాబార్డు వారి సహకారముతో ప్రపంచ జల దినోత్సవం కార్యక్రమం ముందస్తుగా చిట్యాల గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. నీటి ప్రాముఖ్యతను వివరిస్తు జల వనరులను కాపాడుకోవడం మనందరి భాద్యత అని, నీటిని చాలా చాలా పొదుపుగా వాడాలని సంస్థ కార్యదర్శి నబి వివరించారు.
సర్పంచ్ కవిత, బాలయ్య మాట్లాడుతూ తమ పంచాయితి పరిధిలో నీటి వినియోగంలో పొదుపు పాటించేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీటీసీ సభ్యురాలు రాజమణి రవీందర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి మహిళ నీటిని పోదుపుగా వాడాలని సూచించారు. కామారెడ్డి సిడబ్ల్యూసి సభ్యురాలు స్వర్ణలత మాట్లాడుతూ నీటిని ఉపయోగించు విధానమే మనిషి య్నెక్క జీవన విధానమును తెలియజేస్తుందని చిన్న కథ ద్వారా వివరించారు.
మహిళలకు వివిద రకాలైన క్రీడా పోటీలు నిర్వహించారు. లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ నుంచి సర్పంచ్ కవిత బాలయ్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత బాలయ్య, యం.పి.టి.సి రాజమణి రవీందర్, కామారెడ్డి సిడబ్ల్యుసి మెంబర్ స్వర్ణలత, గ్రామ సంఘం అధ్యక్షరాళ్ళు మంజుల, సాయవ్వ, విఏవోలు రుక్మిణి, అనిత, గ్రామంలోని వందమందికి పైగా మహిళలు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.