కామారెడ్డి, మార్చ్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హర్యానా రాష్ట్రంలోని తావ్ దేవి లాల్ ఖేల్ స్టేడియం పంచ్కులలో జరుగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021- 2022 సందర్భంగా దానికి సంబంధించిన జీవోను సర్వీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారు శనివారం విడుదల చేశారు. గేమ్స్‌కు కామారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి రూరల్, జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎంపికయ్యారు.
ఈ సందర్భమును పురస్కరించుకుని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, అధ్యక్షతన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గేమ్స్‌కు సంబంధించిన జీవో కాపీని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ గేమ్స్‌లో పాల్గొని పతకంతో తిరిగి రావాలని కోరారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా పేరును యావత్ దేశానికి తెలిసే విధంగా సత్తా చాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. సాయిలు,
ట్రెజరర్ ఏం.దేవరాజు, ఈసీ మెంబర్ సంతోష్, కామారెడ్డి అర్బన్ ట్రెజరర్ కే. శివ కుమార్ పాల్గొన్నారు.