కామారెడ్డి, మార్చ్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి పనులను మార్చ్ 30 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు అధికారులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలంలో దళిత బందు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు తీయడం పూర్తి చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిపిఓ ప్రభాకర్, జెడ్పి సిఇఒ సాయా గౌడ్, డిఎల్పిఓ సాయి బాబా పాల్గొన్నారు.