కామారెడ్డి, మార్చ్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతులు శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్యాలను పెంచుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో (ఈడబ్ల్యూఆర్‌ఎస్) ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
శిక్షణలో మెళుకువలు నేర్చుకొని యువతులు జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. శిక్షణ కేంద్రంలో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణ ఉచితంగా 45 రోజుల పాటు ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్‌డిఓ అదనపు పిడి మురళి కృష్ణ, డిపిఎం సుధాకర్, శిక్షకులు పాల్గొన్నారు.