మ్యాథమేటిక్స్‌ విభాగంలో రెండ్రోజుల వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాథమెటిక్స్‌ విభాగంలో భారత ప్రభుత్వం వారి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌సిఎస్‌టిసి), తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (టిఎస్‌సిఒఎస్‌టి) సంయుక్త ఆధ్వర్యంలో 10 వ జాతీయ మాథమెటిక్స్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25, 26 తేదీలలో జాతీయ వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నట్లు వర్క్‌ షాప్‌ కన్వీనర్‌ అండ్‌ మాథమెటిక్స్‌ విభాగాధిపతి ఆచార్య కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ సోమవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు.

వర్క్‌ షాప్‌కు చీఫ్‌ ప్యాటర్న్‌గా వీసీ ఆచార్య డి. రవీందర్‌, ప్యాటర్న్‌గా రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ వ్యవహరించనున్నారు. ప్రధాన వక్తలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మాథమెటిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. సి. గోవర్ధన్‌, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన మాథమెటిక్స్‌ ప్రొఫెసర్‌ డా. మల్లా రెడ్డి విచ్చేయనున్నట్లు ఆయన తెలిపారు. వర్క్‌ షాప్‌కు కో – కన్వీనర్స్‌గా కంప్యూటర్‌ సైన్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. బి. నందిని, వి. శ్రీనీవాస్‌, యు. పద్మ, ఎం. చంద్రశేఖర్‌, డా. కె. శ్వేత తదితరులు వ్యవహరించనున్నారు.

బ్రోచర్‌ ఆవిష్కరణలో వీసీ ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివ శంకర్‌, సైన్స్‌ డీన్‌ ఆచార్య ఎం. అరుణ, మాథ్స్‌ విభాగాధిపతి డా. సంపత్‌ కుమార్‌, డా. బి. నందిని, డా. వి. త్రివేణి, చంద్రశేఖర్‌, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »