కామారెడ్డి, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి ఎండల దృష్ట్యా ప్రజల, ఉద్యోగుల దాహార్తిని తీర్చడానికి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చలివేంద్రం, అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజలు ప్రజావాణికి వస్తారని, వారి కోసం ప్రతి సోమవారం అంబలి పంపిణీ చేయాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు వెంకట్ రెడ్డి, రాజారాం, దయానంద్, సాయిలు, దేవేందర్, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.