కాంగ్రెస్‌ నాయకులారా ఖబడ్దార్‌

గాంధారి, మార్చ్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ నాయకులారా ఖబడ్దార్‌. తమ నాయకునిపై బురదజల్లే మాటలు మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెరాస నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌పై చేసిన ఆరోపణలకు దీటుగా సోమవారం గాంధారి తెరాస నాయకులు సమాధానం ఇచ్చారు.

స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల తెరాస నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వారి అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో స్థానికులు ఎవరూ లేరని, అద్దెకు తెచ్చుకున్న కార్యకర్తలతో సభ నిర్వహించారాని ఏద్దేవా చేశారు. ఎప్పుడు చూసినా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడుపోయి పార్టీ మారాడని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించడాన్ని తెరాస నాయకులు ఖండిరచారు.

ఇదివరకే తమ ఎమ్మెల్యే సురేందర్‌ కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారాను అని స్పష్టంగా చెప్పినా వారికి అర్థం కావటం లేదన్నారు. 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అమ్ముడుపోని చరిత్ర కల్గిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తమ నాయకుడు సురేందర్‌ అన్నారు. అమ్ముడు పోయే అలవాటు ఎవరికీ ఉందొ ప్రజలకు తెలుసన్నారు. ప్రతి సారి సురేందర్‌ అమ్ముడుపోయాడని అంటున్న కాంగ్రెస్‌ నాయకులారా మీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుకున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నిజాయితీ పరుడు, ఎల్లారెడ్డిని అభివృద్ధి పథంలో ముందంజలో నిలబెట్టిన తమ నాయకుడు సురేందర్‌ గురించి ఒక ఓటుకు నోటు కేసులో దొంగ ఇంకో సారి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇన్ని సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఈ మూడేళ్ళ కాలంలో చేసి చూపించిన వ్యక్తి సురేందర్‌ అన్నారు. ఎల్లారెడ్డి జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్‌ నాయకులకు కనపడటం లేదా అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి ఒక్కో గ్రామపంచాయతీకి ఇప్పటికే 35 లక్షలతో సీసీ రోడ్లు వేసిన ఘనత తమ ఎమ్మెల్యేది అన్నారు. గాంధారి మండల కేంద్రంలో 9 కోట్ల 75 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌తో కూడిన రెండు లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో 36 కోట్లతో 16 చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తున్నారని తెలిపారు. గుడిమెట్‌ నుండి కరక్వాడీ వరకు రోడ్డుకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు జరగని అభివృద్ధి ఇప్పుడు తమ ఎమ్మెల్యే చేస్తుంటే అది గిట్టని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, కష్టాలలో సైతం నేనున్నాను అనే నాయకుడు నియోజకవర్గన్ని ముందంజలో తీసుకోని వెళ్తున్న తమ నాయకుడు ఎమ్మెల్యే సురేందర్‌పై ఇంకోసారి అవాకులు చావాకులు మాట్లాడితే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా ప్రతిపక్ష నాయకులకు హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, మండల సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షుడు సంజీవ్‌ యాదవ్‌, సొసైటీ చైర్మన్‌ సాయికుమార్‌, ఉప సర్పంచ్‌ కొమ్ముల రమేష్‌, సనాయకులు బలరాం నాయక్‌, సురేష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »