డిచ్‌పల్లి, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పర్యవేక్షించారు.
వివిధ విభాగాలను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. విద్యార్థుల హజరు శాతాన్ని పెంపొంచడం కోసం బోధనోపకరణాలను ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థుల చదువు సంధ్యలో పోటీ తత్త్వాన్ని పెంపొందింపజేయాలని అన్నారు. ఆయా తరగతి గదుల్లో జరుగుతున్న పాఠ్య బోధనను ఆసాంతం పరిశీంచారు. సెలబస్‌లో ఉన్న పాఠ్యాంశాలను ఆధునిక ధోరణులకు అనుగుణంగా మార్చుకోవాలన్నారు. ఇందులో భాగంగా తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ విభాగాలను సందర్శించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలను వీసీ పర్యవేక్షించారు. వారి వెంట ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి, కళల పీఠాధిపతి ఆచార్య పి. కనకయ్య ఉన్నారు.