భీమ్‌గల్, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్‌కు 5 కి.మీ. ల దూరంలో ఉన్న దక్షిణ బద్రీనాథ్‌గా కొలువుదీరిన లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన ఇంతకు పూర్వం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయంలో మూడు షెటర్లలో ఒక్క షెటర్ దాతలు వారి పూర్వీకుల పేర్ల మీద దివ్య ఆశీస్సులతో నిర్మాణ వ్యయం ఆర్థిక సహాయం చేసి వారి పేరు మీద దానం చేశారు. సోమవారం మిగిలి ఉన్న రెండిట్లో ఒక షటర్ గదిని యమునభాయి, బుచ్చన్న, చిలువేరి గుండయ్యా – కీ.శే. మహాలక్ష్మి, రాంచందర్-అనసూయ వామన్-లక్ష్మీ నర్సుభాయ్, శ్రీనివాస్-సత్తెమ్మ, దశరథ్-సుశీల మరియు సమస్త చిలువేరి పరివారముచే దివ్య స్మత్యర్థం వారి కుమారులు కలిసి దాని నిర్మాణ వ్యయం ఆలయానికి చెల్లించారు.
ఇట్టి సముదాయంలో ఎవ్వరైనా భక్తులు సేవ చేయదలచినచో ఇంకొక గదికి అవకాశం ఉన్నది కావున భక్తులు ఎవ్వరైనా ఆసక్తి భావం ఉన్న వారు ఆలయ ఆఫీస్ కార్యాలయం నందు సంప్రదించగలరని ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే సోమవారం చిలువేరి వంశం వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో నంబి పార్థ సారథి, రాజశేఖర్, ఆదిలాబాద్‌కి చెందిన చిలువేరి వంశం కుటుంబీకులు పాల్గొన్నారు.