రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, మార్చ్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న సిర్నపల్లి గ్రామానికి చెందిన రాజన్న (75) వృద్ధుడికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ మానవతా దృక్పథంతో స్పందించి ఈ రోజు 11వ సారి రక్తదానం చేయడం జరిగిందని జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు తెలిపారు.

గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అని తెలియగానే స్పందించి రక్తదానం చేశారు. 11 సార్లు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌కు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌, రాజు, నర్సింలు తదితరులున్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »