డిచ్పల్లి, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణా శిబిరం బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.
కార్యక్రమ కో-ఆర్డినేటర్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. జి. రాంబాబు మాట్లాడుతూ యోగాధ్యానం భారతీయ ఉన్నతమైన సిద్ధాంతాల్లో ఒకటన్నారు. శారీరక దృఢత్వమే గాక, మానసిక ఆహ్లాదం కలుగుతున్నారు. నాడులలో ఉత్తేజం, చలనం కలిగి ఎల్లప్పుడు చాకచక్యం, చాతుర్యం కలుగుతుందన్నారు. వివిధ యోగాసనాల ద్వారా ప్రశాంతత, దృడ చిత్తం కలుగుతాయన్నారు. సూర్యనమస్కారాలు, ఆది ముద్రలు, ఉచ్చ్వాస నిశ్చ్వాల ద్వారా వాయునాళ శుద్ధి జరుగుతుందన్నారు. ప్రాణాయామం, పంచమయ కోశాల వృద్ధి జరుగుతుందన్నారు.
పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) డా. బి. ఆర్ నేత యోగా శిక్షకులుగా వ్యవహరించి, వివిధ యోగాసనాలను వేస్తూ విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. శిక్షణా శిబిరంలో క్యాంపస్ విద్యార్థులు పాల్గొన్నారు.