కామారెడ్డి, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చ్ 23, 1931 రోజున నియంతృత్వ బ్రిటీషు ప్రభుత్వం భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురులను ఉరి తీసి చంపడం జరిగిందని, ఇట్టి రోజును అమరవీరులను స్మరించుకుంటూ షహీద్ దివస్‌ను జరపాలని బిజెవైఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం కామారెడ్డి పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం దేవునిపల్లిలో భగత్ సింగ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు నరేంధర్ రెడ్డి మాట్లాడుతూ నూనూగు మీసాల వయస్సులో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ భరతమాత దాస్యశృంఖలాల విముక్తి చేయడానికి తుపాకి గుండ్లను పూల చెండ్లుగా, ఉరి కొయ్యలనే ఉయ్యాలలుగా చేసుకుని మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మర్చిపోమని, వీర పుత్రుల విజయ గాథలు ఎల్లప్పుడూ ఈ దేశపు యువతలో ఆదర్శాన్ని నింపుతూనే ఉటుందని అన్నారు.