కామారెడ్డి, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో బస్తి దావఖాన ఏర్పాటుకోసం గ్రామ పంచాయతీ భవనం పక్కనే ఉన్న భవనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనంలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్‌ను ఆదేశించారు.
భవనం బస్తి దావఖానకు అనుకూలంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కౌన్సిలర్లు రాణి, మహేష్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.