కామారెడ్డి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్కల్ గ్రామంలో జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. యువకులు ఉత్సాహంగా 41 యూనిట్ల రక్తాన్ని అందజేశారు.
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావడం కోసమే ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 1969 లో ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా రక్తం అవసరం అయినట్లయితే రెడ్‌క్రాస్ సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలను కాపాడుతామని అన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి అనిత, టియు కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక, కమిటీ సభ్యులు మాణిక్య రేఖ, సర్పంచ్ సంగారెడ్డి, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ బైరవ్ రెడ్డి, మండల ఎమ్మార్వో వెంకట్రావు, రెడ్ క్రాస్ డివిజన్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, సెక్రెటరీ జమీల్ హైమద్, విశ్వనాధుల మహేష్ గుప్తా, మండల అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, యమ్‌ఈఓ యోసెఫ్, శివ ప్రసాద్, శ్రీనివాస్, తిరుపతి రమేష్, ఉన్నత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.