కామారెడ్డి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, కలెక్టరేట్ ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.