నిజామాబాద్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలువరించాలని, ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ 9000 చెల్లించాలని, నాలుగు కార్మిక హక్కులను రద్దు చేయాలని, నగదు రహిత వైద్యమ్ అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో అనుమతించాలని, 2018 తర్వాత రిటైర్ అయిన వారి అందరి ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 398 రూపాయలతో అనేక సంవత్సరాలు పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్‌లో ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని, తదితర డిమాండ్లను వారు ప్రస్తావించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, కె. రామ్మోహన్, సుదర్శన్ రాజు, హనుమాన్లు, ముత్తారం, సాయిలు, లావు వీరయ్య, హమీద్, రాధాకృష్ణ, సత్యనారాయణ, జార్జి, బేబీ, మేరీ, ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.