టి.బి. అంతం… మనందరి పంతం…

నిజామాబాద్‌, మార్చ్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుండి చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నర్సింగ్‌ స్టూడెంట్స్‌, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

టీ. బీ అంతం మనందరి పంతం.. క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదాం అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. క్షయ వ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి, వ్యాధి లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం గురించి టీ బీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం, డాక్టర్‌ వెంకన్న, గంగాధర్‌, జిల్లా టీబీ నియంత్రణ విభాగం కో ఆర్డినేటర్‌ రవిగౌడ్‌, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్‌.సిద్ధయ్య, మొయిజ్‌, నర్సింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »