నిజామాబాద్, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం హైదరాబాదులో జరిగిన స్త్రీ నిధి తొమ్మిదవ సర్వ సభ్య సమావేశంలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి స్త్రీ నిధి యందు అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రావడం జరిగింది. అవార్డ్‌ను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు.
స్త్రీ నిధి రుణాలు లక్ష్యం మేరకు పంపిణీ చేయడం, ఇచ్చిన రుణాలను సక్రమంగా వసూలు చేయడం, నిరర్ధక ఆస్తులను అతి తక్కువ శాతం ఉంచడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నందున అవార్డు దక్కింది. కార్యక్రమంలో స్త్రీనిధి డైరెక్టర్ పి.ఉషారాణి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎర్రం పద్మ, మండల సమాఖ్య, పట్టణ సమైక్య అధ్యక్షులు, జోనల్ మేనేజర్ అనంత కిషోర్ పాల్గొన్నారు.