కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 3 న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకుని ఉద్యోగాలు లేక అనేక మంది …
Read More »Daily Archives: March 31, 2022
అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు, బోదన్ ఆర్‌డివో రాజేశ్వర్, నాయకులు పోచారం సురేందర్ …
Read More »ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
డిచ్‌పల్లి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమెన్ సెల్ డైరెక్టర్ డా. అపర్ణ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ… మహిళా శక్తి అనంతమైందని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల విద్యాభ్యసన శాతం అధికంగా ఉందన్నారు. ఫలితాల వెల్లడిలో అన్ని అనుబంధ కళాశాలలను కలుపుకొని …
Read More »పక్షం రోజుల్లో 21వ ప్యాకేజీ జలాలు అందుబాటులోకి…
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి ఇకపై సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపాడ్ బ్యాక్ వాటర్ మళ్లింపు కోసం చేపట్టిన 21వ ప్యాకేజీ పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయని, తద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి బెంగ శాశ్వతంగా దూరం కానున్నదని హర్షం వ్యక్తం చేశారు. …
Read More »మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో మహనీయుల జయంతి వేడుకలపై ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ఏప్రిల్ 5న బాబు …
Read More »కరువు భత్యం అమలుకై ఉద్యమించండి
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన కరువు భత్యం అమలుకై పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. వనమాల కృష్ణ మాట్లాడుతూ 1994లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2021 జనవరి నుండి డిసెంబర్ 2021 వరకు వినిమయ ధరల పెరుగుదల సూచి 1548 పాయింట్ల …
Read More »పక్కా ప్రణాళికతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలి
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదో తరగతి విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత వసతి గృహంలో గురువారం షెడ్యూల్ కులాల, వెనుకబడిన తరగతుల, గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న వసతిగృహాల విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »యువకులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం..
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తదాన కేంద్రంలో గురువారం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. గతంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో …
Read More »వృక్షశాస్త్ర విభాగంలో ‘‘నిపాం’’ ఆన్‌లైన్ సదస్సు
డిచ్‌పల్లి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఏఫ్రిల్ 1 వ తేదీన నిపాం వారి సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ వేదికగా ఆన్ లైన్ సదస్సు నిర్వహించబడనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య రవీందర్ ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చవల్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ వారి సహకారంతో ‘‘ఇంటలెక్చవల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఅర్) పేటెంట్స్ …
Read More »