కామారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తదాన కేంద్రంలో గురువారం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు.
గతంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను మాత్రమే నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం ఆపదలో ఉన్న వారికి సకాలంలో అవసరమైన రక్తాన్ని కూడా అందజేయడం జరుగుతుందని, గత 3 నెలల నుండి ఆపదలో ఉన్న 50 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఎప్పుడూ ఎవరికీ రక్తం అవసరమైన సంప్రదించాలన్నారు, ముందుగా కుటుంబ సభ్యులు రక్తదానానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో రక్తదాతలు రాజు ప్రశాంత్, గణేష్ , సందీప్, ప్రభాకర్ పాల్గొన్నారు.