కామారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో మహనీయుల జయంతి వేడుకలపై ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
దళిత బంధు పథకంలో లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించడానికి ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు.
జయంతి వేడుకలు ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.