డిచ్‌పల్లి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఏఫ్రిల్ 1 వ తేదీన నిపాం వారి సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ వేదికగా ఆన్ లైన్ సదస్సు నిర్వహించబడనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య రవీందర్ ఆవిష్కరించారు.
రాజీవ్ గాంధీ నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చవల్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ వారి సహకారంతో ‘‘ఇంటలెక్చవల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఅర్) పేటెంట్స్ అండ్ డిజైనింగ్ ఫిలింగ్’’ అనే అంశంపై వర్చువల్ వేదికగా ఆన్ లైన్ సదస్సు నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా రాజీవ్ గాంధీ నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చవల్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్‌కు చెందిన ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్ అండ్ డిజైన్ పూజా విషాల్ మౌలికర్ ఆన్‌లైన్‌లో విచ్చేసి ప్రసింగించనున్నారు. అదే విధంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ జవేరియా ఉజ్మా కూడా ప్రసంగించనున్నారు.