కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జిఓఎస్ కాలనీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనం ఆయుష్ వైద్యశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. భవనంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. యోగా కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, …
Read More »Monthly Archives: March 2022
పెండింగ్ ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »పొగ తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే వీలుంది
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగ తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సిగరెట్, బీడీలు, పొగాకు తాగడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే …
Read More »భాజపా వెంటే భారతావని…
నిజామాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తర్రప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తారఖండ్ రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ విజయం భారత ప్రజల విజయమని భాజపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. జిల్లా కోర్టు చౌరస్తాలో టపాకాయాలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసం, యోగి ప్రగతి కార్యక్రమాల …
Read More »ఈ-నామినేషన్ నమోదు ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల భవిష్య నిధి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ-నామినేషన్ నమోదు ప్రక్రియను ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు ఈ-నామినేషన్ నమోదు కోసం గురువారం సాయంత్రం నాగారం శివారులోని దేశాయి బీడీ కంపెనీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో …
Read More »పోలీసు అధికారులకు సన్మానం
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బిక్నూర్ సర్కిల్ కార్యాలయంలో ఇటీవలే నూతనంగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆనంద్ గౌడ్‌లను ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. …
Read More »గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
హైదరాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.100 సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో 48,280 సీట్లు …
Read More »రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ చైర్మన్
వేములవాడ, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ మార్కుఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గురువారం ఉదయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు గుండి నరసింహ మూర్తి ఉన్నారు.
Read More »కాంగ్రెస్ నుండి తెరాసలోకి…
ఆర్మూర్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో ఆలూర్ ఎస్‌ఎంసి చైర్మన్ వెల్మ గంగారెడ్డి, వార్డ్ మెంబెర్ మర్కంటి మహేష్, కాంగ్రెస్ ఎస్.సి.సెల్ నాయకుడు గొంగటి సురేందర్ తెరాస పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వారి స్వగృహంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనఊరు, మనబడి కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో ఆలూర్ …
Read More »దళితబంధుతో కుటుంబ స్థితిగతులు మెరుగుపడాలి
నిజామాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ స్థితిగతులను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. అట్టడుగున ఉన్న తమ వంశాన్ని ఉన్నత స్థితికి చేర్చాలనే కసితో కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించగల్గుతారని అన్నారు. తద్వారా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ అభిమతం నెరవేరుతుందని, దళితబంధు పథకానికి …
Read More »