కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్‌షిప్‌లో ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ధరణి టౌన్‌షిప్‌లో మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్ సమావేశం …
Read More »Monthly Archives: March 2022
రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తహీనత ఉన్న మహిళలను ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో గురువారం జరిగిన జూమ్ మీటింగ్‌లో వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రక్తహీనత ఉన్న మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారికి మందులు అందే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలు పోషకాహార లోపం …
Read More »టీయూలో హెల్త్ సెంటర్‌కు డాక్టర్ల నియామక ప్రకటన
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబోతున్న ఆరోగ్య కేంద్రం (హెల్త్ సెంటర్) లో సేవలందించడానికి ఇద్దరు డాక్టర్స్ నియామకం కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఒకరు మహిళా డాక్టర్, మరొకరు పురుష డాక్టర్ అవసరం ఉందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల వైద్యులు తమ విద్యా వృత్తి అర్హతలు గల ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తుఫారంను మార్చి 10 లోపు రిజిస్ట్రార్, తెలంగాణ …
Read More »క్రాస్ కంట్రీ చాంపియన్ మల్లేష్‌ను ప్రశంసించిన వీసీ
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల విద్యార్థలకు (బాలురు – బాలికలు) ఇటీవల స్పోర్ట్స్ అండ్ గేంస్ డిపార్ట్ మెంట్ నుంచి క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ (10 కి.మీ) పరుగు పందెం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలోని అఫ్లైడ్ ఎకనామిక్స్ విభాగం మూడవ సంవత్సరానికి చెందిన విద్యార్థి ఎస్. మల్లేష్ …
Read More »ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్‌లో ఆయుష్ విభాగం వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయుష్ పరిధిలోకి వచ్చే మొత్తం 16 వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా ఆరు లక్షల …
Read More »భూగర్భ జలాలను సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యం చేయాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషిచేసినందుకు లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్చంద సేవా సంస్థ మరియు ఎస్‌ఐడిఎస్ స్వచ్చంద సేవ సంస్థకి తెలంగాణా రాష్ట్ర స్థాయిలో అవార్డ్ లభించింది. అవార్డును ఫిబ్రవరి 27వ తేదిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, వాటర్ మాన్ అఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చేతులమీదుగా హైదరాబాద్‌లో తీసుకోవడం …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు గురవారం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …
Read More »టీయూలో టాస్క్ ప్రోగ్రాం ప్రారంభం
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం మరియు టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కంప్యుటర్ సైన్స్ బిల్దింగ్ స్మార్ట్ స్కూల్‌లో ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడారు. ‘‘మహింద్ర ఫ్రైడ్ స్కిల్స్ ఎన్ హాన్స్ మెంట్ ప్రోగ్రాం’’ అనే పేరు మీద ఈ కార్యక్రమాన్ని వారం రోజులపాటు నిర్వహించనున్నట్లు …
Read More »ఆజాది కా అమృత మహోత్సన్ చిహ్నంతో టియు క్యాలెండర్
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల వీసీ చాంబర్ లో ‘‘టీయూ క్యాలెండర్ – 2022’’ ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయ కొత్త సంవత్సరం – 2022 క్యాలెండర్ అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుందని అన్నారు. కోవిద్ – 19 నిబంధనల ప్రకారం కొంత ఆలస్యంగా క్యాలెండర్ వెలుబడిరదన్నారు. ఏ …
Read More »ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని విరమించాలి
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో రష్యా దేశం దిష్టిబొమ్మను ధర్నాచౌక్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ, రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిందన్నారు. ఈ …
Read More »