నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని క్షయ వ్యాధి నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. టీ.బీ నియంత్రణ కోసం వారు కొనసాగించిన కృషి కారణంగా జిల్లాకు జాతీయ స్థాయిలో వరుసగా రెండవ సంవత్సరం అవార్డులు లభించాయని, జిల్లాకు మంచి గుర్తింపు దక్కిందని అన్నారు. గత ఏడాది కాంస్య పతకం లభించగా, ఈసారి …
Read More »Monthly Archives: March 2022
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 85 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, …
Read More »వడదెబ్బ మరణాలు చోటుచేసుకోకుండా చర్యలు
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వడదెబ్బ మరణాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ మృతి చెందిన పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల విషయమై సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులకు కలెక్టర్ పలు …
Read More »పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలువరించాలని, ఈపీఎస్ పెన్షనర్ల …
Read More »ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …
Read More »ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్కల్ గ్రామంలో జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. యువకులు ఉత్సాహంగా 41 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి భారీగా యూజిసి గ్రాంట్స్
డిచ్‌పల్లి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, ఢల్లీి చైర్మన్ ప్రొఫెసర్ జగదేష్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారి వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, యూజీసీ డైరెక్టర్ డా. సిహెచ్. ఆంజనేయులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ జగదేష్ కుమార్ టీయూ వీసికి చిర …
Read More »జిల్లా అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విధుల పట్ల అలసత్వ వైఖరి ప్రదర్శించే వారిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అవసరమైతే సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. ప్రత్యేకించి నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కరాఖండీగా తేల్చి చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆయా …
Read More »మౌలిక సదుపాయల కల్పనకే మన ఊరు ` మన బడి
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు- మన బడి కార్యక్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టనున్న …
Read More »పక్షం రోజుల్లోపు పనులు ప్రారంభించాలి
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అవసరమైన పనులను గుర్తిస్తూ, పక్షం రోజుల్లోపు అవి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, విద్యా శాఖ, …
Read More »