కామారెడ్డి, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 5 వ తేదీన డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈ నెల 5 న ఉదయం 10.30 గంటలకు జయంతి ని పురస్కరించుకుని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పుష్పాలంకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సమావేశం ఉంటుందన్నారు. వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు.
కార్యక్రమానికి జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంఎల్సిలు, మునిసిపల్ ఛైర్మన్లు, ఎంపిపిలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, దళిత సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.