నిజామాబాద్, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూడ మాస్టర్ ప్లాన్‌లో వినాయక్ నగర్ నుండి నాగారం రోడ్డు వరకు ప్రతిపాదించిన వంద ఫీట్ల రోడ్డు మార్గాన్నే సర్వే చేయాలని, ఆ ప్రాంతమంతా పేద, మధ్య తరగతి వారు ఇండ్లు నిర్మించుకున్నారని, ప్లాట్స్ కొనుగోలు చేశారని, నగర నడిబొడ్డు నుండి వంద ఫీట్ల రోడ్డు అవసరం లేదని, ఆ రోడ్డును రద్దు చేయాలని కోరుతూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మెమోరాండం సమర్పించారు.
రోడ్డు మూలంగా నష్టపోయే బాధితులతో సమావేశం ఏర్పాటు చేయాలని, వర్ని రోడ్డు నుండి బోధన్ రోడ్డు వరకు ఉన్న వంద ఫీట్ల రోడ్డును ఏ ప్రాతిపదికన రద్దు చేశారో అదేవిధంగాఈ రోడ్డును కూడ రద్దు చేయాలని వారు కోరారు.