డిచ్‌పల్లి, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్‌సి, ఎస్‌టి సెల్ డైరెక్టర్ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు.
ఈ సందర్బంగా డా. భ్రమరాంబిక మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయ దురంధురుడు బాబు జగ్జీవన్ రాం అని కొయాడారు. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన బాబు జగ్జీవన్ రాం సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారన్నారు. వారి కాలంలో దేశ రాజకీయ రంగంలో సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఉప ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి సంక్లిష్టమైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులెన్నింటినో అధిగమించారన్నారు.
కార్యక్రమంలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జమీల్ అహ్మద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) డా. నర్సయ్య, విద్యార్థులు, చంద్రశేఖర్, దిలీప్, శ్రీకాంత్, గంగాధర్, పవన్, స్వర్ణ మ్యాల, సంధ్య, ప్రశాంతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.