నిజామాబాద్, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్, నగర, రూరల్ సబ్ డివిజన్ కమిటీల నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకులు ఎం.వెంకన్న అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా తీసుకువస్తున్నారన్నారు.
ప్రజల నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ప్రజా పోరాటాల్లో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా జనరల్ బాడీ సమావేశం పలు తీర్మానాలు చేసింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలి, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. బస్సు ఛార్జీలు, కరెంటు చార్జీలు తగ్గించాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలి.
జనరల్ బాడీ మీటింగ్‌లో సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా డివిజన్ నాయకులు ఆల్గోట్ రవీందర్, గోదావరి, ఎం.సుధాకర్, సాయగౌడ్, సంధ్యారాణి, కిషన్, కల్పన, మురళి, విటల్, కిరణ్, శకుంతల, నారాయణ, ప్రశాంత్, శివ కుమార్, లక్ష్మీకాంత్, రాము తదితరులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.